జైశ్రీరామ్.
|| 10-37 ||
శ్లో. వృష్ణీనాం వాసుదేవోऽస్మి పాణ్డవానాం ధనఞ్జయః|
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః.
తే.గీ. వాసుదేవుండ శ్రీవృష్టివంశమునను,
పాండవులలోన పార్థుండై పరగుదేనె,
మునులలో నేను వ్యాసుండ పుణ్య చరిత!
కవులలోనశుక్రాచార్య కనగ నేనె.
భావము.
నేను వృష్టి వంశస్తులలో వాసుదేవుడిని, పాండవులలో,
అర్జునుడిని, మునులలో వ్యాసుడిని, కవులలో శుక్రాచార్యుడిని.
|| 10-38 ||
శ్లో. దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్|
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్.
తే.గీ. శాసకులలోనీదండన, జయము కోరు
వారిలో నీతియు, రహస్య భావ మౌన
మరయ నేనేను, జ్ఞానులన్ వరలు జ్ఞాన
మదియు నేనేను,పార్థుడా! మదిని గనుమ.
భావము.
శాసకులలో దండమూ, జయంకోరేవాళ్ళల్లోని నీతీ, రహస్యాలలో
మౌనమూ, జ్ఞానులలో జ్ఞానమూ నేనే.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.