గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఆగస్టు 2022, గురువారం

పవనః పవతామస్మి రామః ...10 - 31...//..సర్గాణామాదిరన్తశ్చ, .10 - 32,,,//...శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

 జైశ్రీరామ్.

|| 10-31 ||

శ్లో.  పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్|

ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ.

తే.గీ.  పావనులలోన వాయువున్, పార్థ! నేను,

శస్త్ర ధారులన్ రాముడన్, జలచరముల

మొసలి నేనేను, పుణ్య చరిత!

నదులలో గంగ నేనేను నన్ను గనుమ.

భావము.

నేను పావనం చేసేవాళ్ళల్లో వాయువుని శస్త్రధారులలో రాముడిని, 

జలచరాలలో ముసలిని, నదులలో గంగని.

|| 10-32 ||

శ్లో.  సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జున|

అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్.

తే.గీ. ఆది మధ్యాంతముల్ నేనె నరయ సృష్టి

ననితరాధ్యాత్మ విద్య నేననుపమాన!

వాదనములలో వాదమై ప్రబలుదేనె,

పార్థ! గ్రహియించువారలు పరవశింత్రు.

భావము.

అర్జునా! సృష్టులన్నిట్లో ఆదిమధ్యాంతాలు నేనే. విద్యలలో 

ఆధ్యాత్మ విద్యని, వాదించేవాళ్ళల్లో వాదాన్ని నేనే.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.