జైశ్రీరామ్
|| 11-27 ||
శ్లో. వక్త్రాణి తే త్వరమాణా విశన్తి
దంష్ట్రాకరాలాని భయానకాని|
కేచిద్విలగ్నా దశనాన్తరేషు
సన్దృశ్యన్తే చూర్ణితైరుత్తమాఙ్గైః.
తే.గీ. అతి భయంకరదంష్ట్రలనమరినముఖ
ములను జేరి, చిక్కుచును కోరలకు మరియు
నక్కడటునుగ్గుగానయిరనుపమాన!
భయము కలుగుచుండె నో భక్త సులభ!
భావము.
భయంకరములైన కోరలతోగూడిన నీ ముఖములయందు
అతివేగముగా పరుగులుదీయుచు ప్రవేశించుచున్నారు.
కొందఱి తలలు కోరల మద్యబడి నుగ్గునుగ్గైపోవుచుండగా
వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు.
|| 11-28 ||
శ్లో. యథా నదీనాం బహవోమ్బువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవన్తి|
తథా తవామీ నరలోకవీరా
విశన్తి వక్త్రాణ్యభివిజ్వలన్తి.
తే.గీ. నదులు సంద్రంబులోపలికొదుగునట్లు
సమరయోధులు నీముఖసరసిజమున
కభిముఖంబుగసాగిరోయగ్ని ముఖుడ!
చూడజాలను శాంతించు సుగుణభాస!
భావము.
అనేకములైన నదీనదములప్రవాహములన్నియును సహజముగా
సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు
ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్ఠులైన సమరయోధులు (నరలోకవీరులు)
కూడ జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.