జైశ్రీరామ్.
సఞ్జయ ఉవాచ.
భావము.
సంజయుడిట్లు పలికెను.
|| 11-9 ||
శ్లో. ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః|
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్.
తే.గీ. వినుము ధృతరాష్ట్ర! కృష్ణుడీవిధము పలికి
చూపె తన విశ్వరూపమున్, శుభనిధాన
దివ్య మహిమాన్వితంబైన భవ్యమయిన
విశ్వరూపంబు పార్థుడు ప్రీతిని గనె.
భావము.
ఓ ధృతరాష్ట్ర మహారాజా! మహా యోగీశ్వరుడైన భగవానుడిట్లు
చెప్పిన పిమ్మట సర్వోత్తమమైన ఐశ్వర్యరూపమైన తన మహిమాన్విత
విశ్వరూపమును పార్థునకు చూపెను.
|| 11-10 ||
శ్లో. అనేకవక్త్ర నయన మనేకాద్భుత దర్శనమ్|
అనేక దివ్యాభరణం దివ్యానేకోద్య తాయుధమ్.
తే.గీ. వక్త్రములు కండ్లనేకముల్, ప్రభలనీను
దివ్యమౌయలంకారముల్, భవ్యపు మహి
తాయుధంబులనొప్పి, మహాద్బుతముగ
నొప్పు విశ్వరూపము జూపె నప్పుడటను.
భావము.
అనేక వక్త్రములతో, అనేక నేత్రములతో, అనేక అద్భుత
దర్శనములతో, అనేక దివ్యాభరణములతో, దివ్యాయుధములతో
భగవానుని ఘన దివ్యరూపము శోభిల్లుచుండెను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.