జైశ్రీరామ్
|| 11-7 ||
శ్లో. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్|
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ ద్రష్టుమిచ్ఛసి.
తే.గీ. కను చరాచరములనునీ కాంక్ష తీర
లోకములగల సర్వమున్ శ్రీకరముగ
చూడు నాలోననిప్పుడే శుభకరముగ
నెవ్వరును గాంచరీ రూపు, కవ్వడి! కను.
భావము.
ఓ అర్జునా! నాదేహమందే చరాచర ప్రపంచమునెల్లను ఒకే చోట
నున్నట్లు ఇక్కడే ఇప్పుడే చూడుము. మరియు నీవు చూడగోరినదెల్ల
నాలోనే చూడుము.
|| 11-8 ||
శ్లో. న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా|
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్.
తే.గీ. స్థూలధృష్టితో కనలేవు సూక్ష్మమయిన
దివ్యచక్షువులిచ్చెద తృప్తి నీవు
చూడు నావిశ్వ రూపమున్, శోభనీయ
మనుపమంబగువైభవమును గనుమిట.
భావము.
నీ స్థూల దృష్టితో నా అనంత స్వరూప మహిమను చూడలేవు.
కనుక దివ్యదృష్టి నీకిచ్చుచున్నాను. ఈ ఙ్ఞాన దృష్టితో అపారమైన
నా విశ్వరూప వైభవమును గాంచుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.