గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఆగస్టు 2022, సోమవారం

డా.దాశరథి కృష్ణమాచార్యులవారి శత జయంతి సందర్భముగా నా పద్యనీరాజనమ్. తే.22 - 7 - 2022.

  జైశ్రీరామ్

డా.దాశరథి కృష్ణమాచార్యులవారి శత జయంతి సందర్భముగా 

నా పద్యనీరాజనమ్.

ఉ.  నా తెలగాణ కోటి రతనాల మహాద్భుత వీణ యంచు, వి

ఖ్యాతిగ పల్కినట్టి గుణ గణ్యుని, దాశరథీ మహాకవిన్,

జాతి స్మరించుచుండుటను చక్కని ప్రేరణ కల్గు జాతికిన్,

నీతిగ ధర్మ బద్ధుఁడయి నేర్పుగ నుద్యమ బాటఁ బట్టి,వి

 

ఉ.  ఖ్యాతిగ విప్లవ ప్రభలు గణ్య కవిత్వము లోనఁ గొల్పి, తా 

మాత తెలుంగు భాషకును, మాన్యతనీ తెలగాణ స్వేచ్ఛకై

రాతిరియున్ బవల్ గనక శ్రద్ధగ నుద్ధతితోడఁ బోరి, ప్ర

ఖ్యాతిని పొందినారుకలకాలమునిల్చెడి పాటలెన్నియో

 

ఉ.  తిని వ్రాసినారుకురిపించిరి భీతిల నగ్నిధారనే,

భాతిగ రుద్రవీణను ప్రభావము చూపగ మీటి, గాంచిరా

సేతు హిమాచలంబు కవి సింహమటంచును గొప్ప కీర్తి, వి

ఖ్యాతిని గన్న దాశరథికి గౌరవమొప్ప నమస్కరించెదన్.

చింతా రామకృష్ణారావు.

తే.22 - 7 - 2022.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.