జైశ్రీరామ్.
శ్రీభగవానువాచ|
భావము.
భగవానుడు అనుచున్నాడు.
|| 11-5 ||
శ్లో. పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః|
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ.
తే.గీ. కను మసంఖ్యాకముగననేకవిధములగ
కల యనేక వర్ణంబులు, కలయనేక
మయినయాకృతులనునొప్పు, మద్విశిష్ఠ
రూపమునుగాంచు మర్జునా! లోపరహిత!
భావము.
ఓ పార్థా! అసంఖ్యాకములైన, అనేక విధములుగనున్న,
అనేక వర్ణములు కలిగిన, అనేకాకృతులలో నున్న నా దివ్య
రూపమును చూడుము.
|| 11-6 ||
శ్లో. పశ్యాదిత్యాన్వసూన్రుద్రానశ్వినౌ మరుతస్తథా|
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత.
తే.గీ. వసువులన్ రుద్రులన్, మరుద్భాస్కరులను,
గనుము సూర్యాశ్వినీ తతిన్ మునుపెవరును
గనని యద్భుతంబైన విశ్వరూపునిపుడుడిట
నర్జునా! నీకు చూపెద ననుపమముగ.
భావము.
ఓ అర్జునా! ద్వాదశాదిత్యులను, అష్ట వసువులను, ఏకాదశ
రుద్రులను, అశ్వనీ దేవతలను, సప్త మరుత్తులను నాలో
చూడుము. మరియు మహాశ్చర్యమును కలిగించే పూర్వమెప్పుడూ
ఎవ్వని చేత చూడబడని అనేక అద్భుతములను నాలో
నిపుడుగాంచుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.