గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2022, బుధవారం

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ- ...11 - 33...//.ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ- , , .11 - 34,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

జైశ్రీరామ్.

 || 11-33 ||

శ్లో.  తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ

జిత్వా శత్రూన్ భుఙ్క్ష్వ రాజ్యం సమృద్ధమ్|

మయైవైతే నిహతాః పూర్వమేవ

నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్.

తే.గీ.  కాన పార్థ! యీ యుద్ధంబు కాదనకుము,

నేనె చంపితీ వీరలన్ గాన నీవు

కారణ మగుమ యుద్ధమునచ కోరి చేసి,

స్ఫూర్తి గాంచుము దీనిచే కీర్తి గనుము.

భావము.

కనుక ఓ సవ్యసాచీ! లెమ్ము, కీర్తిగాంచుము. శత్రువులను జయించి 

సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. 

వీరందఱును నాచేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము.

|| 11-34 ||

శ్లో.  ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ

కర్ణం తథాన్యానపి యోధవీరాన్|

మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా

యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్.

తే.గీ.  చంపితిని నేను పూర్వమే చంపు మిపుడు

భీష్మ, ద్రేణ, కర్ణాదులన్, వీరతతిని,

యుద్ధమును జేసి గెలుపొందు మొప్పుగాను, 

భీతి విడువుము, యత్నించు ప్రీతితోడ.

భావము.

ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ (సైంధవ) 

కర్ణాది యుద్దవీరులందఱిని నీవు సంహరింపుము. భయపడకుము. 

రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక 

యుద్దము చేయుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.