జైశ్రీరామ్.
శ్లో. అసంపన్నః కథం బంధుః ? అసహిష్ణుః కథం ప్రభుః ?అనాత్మవిత్ కథం విద్వాన్ ? అసంతుష్టః కథం సుఖీ ?
గీ. పేద యింటికి బంధువుల్ పోదురొక్కొ?
ఓర్పు లేకున్న రాజెట్టులుర్వినేలు?
కనక పండితుల్ దైవమున్ ఘనులగుదురె?
తుష్టి లేకున్నసుఖములు తోడ నున్నె?
భావము. సంపన్నుడు కాకపోతే బంధువెలా అగును ?(సంపన్నులకందరూ బంధువులమని చెప్పుకుంటారు ) ఓర్పు లేనివాడు రాజెట్లగును? పరమాత్మ స్వరూపం తెలియనివాడు విద్వాంసుడెట్లగును? సంతృప్తి లేనివాడు ఎలా సుఖముకలవాడగును?
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.