జైశ్రీరామ్.
శ్లో. అర్థానామార్జనే దుఃఖ మార్జితానాం చ రక్షణేఆయే దుఃఖం వ్యయే దుఃఖం ధి గర్థం దుఃఖభాజనమ్॥
గీ. ధనమునార్జింపగా దుఃఖమనుభవమగు.
దాని దాయంగ దుఃఖము ధరణి పైన.
పెంచ, వెచ్చింప దుఃఖము, భీతిఁ గొలుపు
దుఃఖ దాయిని ధన వాంఛ దూరమగుత.
భావము. ధనము సంపాదించునప్పుడు దుఃఖం. సంపాదనను కాపాడుకొనేప్పుడు దుఖం. సంపాదించినది వృద్ధి కాలేదని దుఃఖం. ఉన్న ధనం ఖర్చయి పోతోందని దుఃఖం. కావున దుఃఖ కారకమైన ధనము నింద్యము.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.