జైశ్రీరామ్.
శ్లో. అగ్నిహోత్రం గృహం క్షేత్రం , గర్భిణీం వృద్ధబాలకౌ ,రిక్తహస్తేన నోపేయాత్ , రాజానాం దైవతం గురుమ్ . మనుస్మృతి.
గీ. వట్టి చేతుల పోరాదు వసుధపైన
అగ్నికార్యంబు, స్వగృహంబు, నఖిల క్షేత్ర
ములు, గురున్, గర్భిణిన్, వృద్ధు, భూపు, దైవ,
బాల దర్శనార్థము పోవుచో. భవ్యులార!
భావము. అగ్నిహోత్రము, స్వగృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీ స్త్రీ, ముసలివారు, బాలురు, రాజు, దైవము, గురుడు - వీరివద్దకు బోవునప్పుడు వట్టిచేతులతోపోరాదు. ఏదో పండునైన, పూవునైన తీసుకొనిపోయి, సమర్పించ వలెను.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.