గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, సెప్టెంబర్ 2014, బుధవారం

ప్రియః ప్రజానాం దాతైవ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో.ప్రియః ప్రజానాం దాతైవ - న పునర్ద్రవిణేశ్వరః
అగచ్ఛన్ కాంక్ష్యతే లోకై - ర్వారిదో న తు వారిధిః. 
క. ప్రజలకు దాతయె ప్రియమిల, 
నిజధన సంవర్ధి కాడు. నేర్పున కురిసే 
సుజలములు కలుగు మేఘమె 
ప్రజలకు హితమౌను, జలధిఁ వలవరు ప్రీతిన్.
భావము. ప్రజలకు ధనవంతునికంటే దాతయే ప్రియమైనవాడు. 
ఈ లోకంలో అందరూ నీటినిచ్చే మేఘాన్నే కోరుకుంటారు గానీ 
నీటికి నిధియైన సముద్రుని కాదు. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.