జైశ్రీరామ్.
శ్లో. సంతస్తృణోత్సారణ ముత్తమాంగాత్ సువర్ణ కోట్యర్పణ మామనంతి
ప్రాణ వ్యయేనా உపి కృతోపకారాః
ఖలాః పరే వైర మివోద్వహంతి.
క. తలనున్న గడ్డి తీసిన
తలతురు మేల్ చేసెనట్లు ధర్మాత్ములిలన్.
వెలలేని మేలు పొందొయు
తలపక, యపకృతిని చేయు దౌర్భాగ్యుడిలన్.
భావము. తమ తలపై నున్న గడ్డి పరకను ఎవరైనా తొలగించినంత మాత్రాన సత్పురుషులు దానిని గొప్ప సువర్ణ రాశి ఇచ్చినట్టుగా భావిస్తారు. ప్రాణాలకు తెగించి దుర్జనులకు ఉపకారం చేస్తే, వారు ఆ ఉపకారం చేసినవారి పట్ల విరోధభావం పెంచుకుంటారు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.