జైశ్రీరామ్.
శ్లో. దానం భోగో నాశ స్తిస్రో గతయో భవన్తి విత్తస్యయో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి॥
గీ. దాన, భోగ, వినాశము ధనము గతులు.
విత్త సముపార్జితులు దాని విలువ నెఱిఁగి
దాన భోగాల వెచ్చించి తనియవలయు
కానినాడది నాశమౌన్. కానరేల?
భావము. ధనమునకు దానము, భోగము, నాశనము అను మూడే గతులు, ఒకరికీయక, తాననుభావింపక కూడబెట్టిన ధనమునకు నాశనమే కలుగును.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.