జైశ్రీరామ్.
శ్లో. స్వదత్తా ద్ద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనమ్,పరదత్తాపహారేణ, స్వదత్తం నిష్పలం భవేత్.
గీ. ఇతరు లొనరించు దానమ్ము నతిశయముగ
కాయ, ద్విగుణమౌ తన దాన కర్మ ఫలము.
వాటి హరణంబు చేసెడివారికిలను
పుణ్యఫలములు నశియించిపోవు. నిజము.
భావము. ఇతరులు చేసిన దానమును పాడుచేయక దానిని సంరక్షించినట్లయితే, తాను స్వయంగా చేసిన దానముకన్నను రెండు రెట్లు అధికంగా పుణ్యము ప్రాప్తిస్తుంది. ఇతరులు చేసిన దానమును హరించుట వల్ల తాను చేసిన దానముల వల్ల సంపాదించుకున్న పుణ్యవిశేషం ఏదైనా వుంటే అది నిష్ఫలమైపోతుంది. ( జనకుడు చేసిన కన్యా దానానికి ఘాత కలుగించి, రావణుడు తన తపస్సు అంతా నష్టపోయి నశించాడు.)
గమనిక: పరోపకారం చెయ్యండి. లోకం కోసం ఇతరులు చేసిన మంచిని కాపాడడం కూడా ఉపకారమే.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.