జైశ్రీరామ్.
శ్లో. ఈశ్వరే నిశ్చలా బుద్ధిః , దేశార్థం జీవనస్థితిఃపృథివ్యాం బంధువద్వృత్తిః ఇతి కర్తవ్యతా సతామ్.
గీ. నిరతమగు దైవ భక్తిని నిశ్చలముగ
కలిగి, దేశంబుకై తాను మెలగుచుండు,
లోకులెల్లరు తన బంధు లోకమనుచు
సజ్జనుండెదతలచును సహజముగనె.
భావము. పరమేశ్వరునియందు నిశ్చలమైన బుద్ధి కలిగి ఉండటం , దేశముకోసమే తన జీవితమని భావించటం, లోకులందరియందు బంధుభావన కలిగి ఉండటం సజ్జనుల కర్తవ్యం.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.