జైశ్రీరామ్.
శ్లో దానేన భోగీ భవతి, మేధావీ వృద్ధసేవయాఅహింసాయ చ దీర్ఘాయుః ఇతి ప్రాహు ర్మనీషిణః.
గీ. దానమున భోగి యగు వసుంధరను నరుఁడు.
పూజ్యులకు సేవ చేసిన బుద్ధి పెరుగు.
క్షమ, యహింసల దీర్ఘాయు వమరి బ్రతుకు.
దాన సేవ నాஉహింసల తనియుఁడయ్య.
భావము. మానవుడు దానం చేస్తే భోగి అవుతాడు, పెద్దలను సేవించటం వల్ల బుద్ధి కుశలత కలవాడౌతాడు, అహింస వల్ల దీర్ఘాయువౌతాడని విద్వాంసులు చెప్తారు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.