జైశ్రీరామ్.
శ్లో. సత్యం తపో జ్ఞానమహింసతా చ ,విద్వత్ప్రణామం చ సుశీలతా చ ఏతాని యో ధారయతి స విద్వాన్ , న కేవలం యః పఠతే స విద్వాన్ .
గీ. సత్య తపములు, జ్ఞానమ్ము, సత్ప్రశంస,
వినయ విద్వాంసమన్నన విజ్ఞతయును,
శీల సంపత్తి, గల యట్టి మేలి మగడె
విబుధుఁడనఁ జెల్లు. నితరులు విబుధ భృవులె.
భావము. సత్యము, తపస్సు, జ్ఞానము, అహింస, విద్వాంసులకు వినయంతో నమస్కరించటం, స్వచ్ఛమైన శీలము ఎవనికి ఉంటాయో అతడే విద్వాంసుడు. కేవలం చదువుకున్నవాడు విద్వాంసుడు కాడు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.