జైశ్రీరామ్.
శ్లో. యో உ ధికాద్యోజన శతాత్పశ్యతీ హామిషం ఖగఃస ఏవ ప్రాప్తకాలస్తు పాశబంధం నపశ్యతి.
గీ. ఎంత దవ్వునుండైనను సాంతముఁ గను
మాంస ఖండంబులను పక్షి మహితముగను.
అట్టి పక్షియే తన్ బట్ట పెట్టినట్టి
వలను కానగ లేదు! తా తొలగ లేదు.
భావము. ఏ పక్షి నూరు యోజనముల దూరమునుంచి యైనను మాంస ఖండమును చూడగలదో , ఆ పక్షియే కాలం మూడినపుడు తనను పట్టటానికి పన్నిన వలను చూడజాలదు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.