జైశ్రీరామ్.
శ్లో. ధర్మార్థం క్షీణ కోశస్య కృశత్వమపి శోభతేసురైః పీతావశేషస్య శరద్ధిమ రుచేరివ.
గీ. దేవతలు త్రాగ మ్గిలిన దివ్య జ్యోత్స్న
తేజరిలె శరచ్చంద్రికై దివ్యముగను.
దాన ధర్మాదులన్నిధుల్ తరిగి కూడ
శోభిలాగారముల్ దాన ప్రాభవమున.
భావము. దేవతలు త్రాగగా మిగిలిన సన్నని శరత్కాలపు వెన్నెల కాంతిలా, ధర్మాచరణలో ఒకని ధనాగారం క్షీణించిపోయినా , ఆ సన్నగిల్లటం కూడా శోభిస్తుంది.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.