జైశ్రీరామ్.
శ్లో. సుహృదాం హిత కామానాం యశ్శ్రుణోతి న భాషణంవిపత్సన్నిహితా తస్య స నరశ్శత్రు నందనః.
గీ. బంధు మిత్రుల సద్బోధ వరలనీక
దుష్ట వర్తన మెలిగిన భ్రష్టుఁడగును.
శతృకోటికి యానంద పాత్రుఁడగును.
మంచి చెప్పిన వినవలె మహితులార!
.భావము ఎవడు - సజ్జనులు, తన మేలుకోరేవారు చెప్పే హితభాషణలు వినడో , వాడు ఆపదలను పొంది తన శత్రువులకు ఆనందం కలిగించేవాడౌతాడు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.