జైశ్రీరామ్.
శ్లో. యోஉన్య ముఖే పరివాదః ,స ప్రియ ముఖే పరిహాసఃఇతరేంధనజో ధూమః , సోஉగరు జాతో భవేద్దూపః.
క. ఇతరులు పల్కిన దూషణ,
యతులితమగు హాస్య మదియె ఆప్తులు పలుకన్.
క్షితి పొగయగు కట్టెల పొగ
యతులిత ధూపమగు చందనాదుల పొలియన్.
భావము. ఇతరుల నోటినుంచి వస్తే దూషణం అనిపిస్తుంది. అదే మాట తనకు ఇష్టమైన వాని నోటినుంచి వస్తే , హాస్యం అనిపిస్తుంది. ఇతరములైన కట్టెల నుండి వచ్చినది ధూమమౌతుంది. చందనపు చెక్కనుంచి వస్తే ధూపమౌతుంది!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.