జైశ్రీరామ్.
శ్లో. దానే తపసి శౌర్యే చ , విజ్ఞానే వినయే నయే విస్మయో హి న కర్తవ్యో బహురత్నా వసుంధరా.
గీ. దాన, తప, శౌర్య, వినయ, విజ్ఞాన, నీతి,
శోభితులయందు గర్వమ్ము చొచ్చుకొనదు.
మహితులిలనుంద్రు పెక్కురు మహిని. వారి
నరసి నేర్తురు సచ్ఛీల నాదికములు.
భావము. దానము, తపస్సు, పరాక్రమము, విజ్ఞానము,వినయము, నీతి - కలిగి ఉన్నందువల్ల ఏమాత్రమూ గర్వపడకూడదు. ఈ సద్గుణాలున్నవారు ఈ లోకంలో మరెందరో ఉంటారు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.