జైశ్రీరామ్.
శ్లో. సా విద్యా యా మదం హంతి , సా శ్రీ ర్యర్థిషు వర్షతిధర్మానుసారిణో యా చ సా బుద్ధిరభిదీయతే.
గీ. మదము నణచునదే విద్య మహిని కనగ.
అర్హులకునీయఁబడునెద్ది అదియె ధనము.
ధర్మవర్తనగలబుద్ధి ధరణి బుద్ధి.
సుజనులందుననివి యుండి శోభ కూర్చు.
భావము. ఏది గర్వాన్ని అణచివేస్తుందో,అదే నిజమైన విద్య. అర్థుల కోసం ఏది ధారాళంగా వర్షింప బడుతుందో అదే నిజమైన సంపద. ఏది ధర్మాన్ని అనుసరిస్తుందో అదే నిజమైన బుద్ధి.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.