జైశ్రీరామ్.
శ్లో కాష్ఠభారసహస్రేణ ఘృతకుంభశతేన చ అతిథిర్యస్య భగ్నాశస్తస్య హోమో నిరర్థకః.
గీ. ధనము వెచ్చించి కట్టెలు, తగిన నేయి,
అమరికను చేసి క్రతువులనరసి చేసి,
ఒక్క యతిథియే యగు ప్రీతి నందకున్న,
వ్యర్థమా క్రతువంతయునరయుఁడయ్య.
భావము. ఎన్నో కట్టెలను , వందలకొలది నేతి కుండలను వినియోగించి యజ్ఞం చేసినా, ఒక్క అతిథి నిరాశ చెందితే ఆ యజ్ఞం నిరర్థక మౌతుంది.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.