జైశ్రీరామ్.
శ్లో. అభివాదయేత్ వృధాంశ్చ, దద్యాచ్చైవాసనం స్వకమ్,కృతాంజలి రుపాసీత, గచ్ఛతః పృష్ఠతోన్వియాత్.
గీ. పెద్దవారిని కనుగొన్నఁ బ్రీతితోడ
వందనము చేసి యాసనమందు నిలిపి,
ప్రీతితోడుత పలికి విఖ్యాతి మెలఁగ
సంతసింతురు వారు. నిన్ సన్నుతింత్రు.
భావము. వృద్ధులకి నమస్కరిచడం, నీ ఆసనమును వారికి ఇయ్యటం, అంజలి బద్ధుడవైయుండి, వారు వెళ్ళునప్పుడు వెనుకనే కొంత దూరము సాగనంపాలి.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.