జైశ్రీరామ్.
శ్లో. ఛాయామన్యస్య కుర్వంతి తిష్ఠంతి స్వయమాతపే ఫలాన్యాపి పరార్థాయ వృక్షా: సత్పురుషా: ఇవ .
క. పరులకు నీడగ నిల్చుచు,
తరువులు తామెండలోన తపియించునటుల్
నిరుపమ సేవను పరులకు
కరుణాత్ములు చేసి తాము గాంతురు వెతలన్.
భావము. వృక్షాలు తమ నీడను అన్యులకు ఇస్తూ , తాము స్వయంగా ఎండలో నిలబడుతున్నాయి. సత్పురుషుల వలె తమ ఫలములను కూడా పరులకే ఇస్తున్నాయి.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.