గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జూన్ 2025, మంగళవారం

కేశావా అనీ నిన్నూ వాసీగా భక్తూలూ వర్ణించూచున్నారూ మేలుకో.... మేలుకొలుపు పాట.

 

కేశవనామాలు మేలుకొలుపులు
విష్ణుభక్తిని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక.
అను ప్రహ్లాదుని వాక్యంబులు కైవడి హరిభక్తి లేనివారందఱు ద్విపాద పశువు లగుచున్నారు. కావున ప్రతివారును హరిభక్తి పరాయణులై సార్ధ కములగు ధర్మస్థాపనల చేసి శాశ్వతైశ్వర్య సుఖంబు | నందుటకు తమ తమ జన్మములను పవిత్రంబు జేసి ' కొందురని వేడుచున్నాను.

కేశవ! అని నిన్ను వాసిగ భక్తులు వర్ణింపుచున్నారు మేలుకో
వాసవవసుత వసుదేవనందన వైకుంఠవాసుడు కృష్ణా మేలుకొ.

నారాయణ! నిన్ను నమ్మినభక్తుల కరుణ బ్రోతువు వేగ మేలుకో 
శరణన్న రక్షణ బిరుదు నీకున్నది. శశిధరసన్నుత మేలుకో,

మాధవయని నిన్ను యాదవు అందరు మన్నించుచున్నారు మేలుకో 
చల్లనిచూపుల తెల్లని నామము నల్లని నాస్వామి మేలుకో,

గోవిందయని నిన్ను గోపికలందరు గొల్లవాడందురు మేలుకో
గోపీమనోహర గోవరనోద్ధార గోపాలబాలుడ మేలుకో.

విష్ణురూపముదాల్చి విభవము దర్శించి విష్ణుస్వరూపుడు మేలు కో
దుష్ట సంహారక దురితము లెడబాపి సృష్టి కావగ నీవు మేలుకో,

మధుసూధన నీవు మగువతోడుతగూడి మరచి నిద్రించేవు మేలుకో 
ఉదయార్కబింబము ఉదయించు వేళాయె వనరుహలోచన మేలుకో.

త్రివిక్రమాయని శక్రాదులందరు విక్రమమందురు మేలుకో
శుక్రాదిగ్రహములు సుందరరూపము చూడగోరి వచ్చె మేలుకో.

వామనరూపమున భూదానమడిగిన పుండరీకాక్షుడ మేలుకో
బలిని నీ పాదమున బంధన జేసిన కస్యపనందన మేలుకో.

శ్రీధర, గోవింద, రాధామనోహర యాదవకులతిలక మేలుకో
రాధావధూమణి రాజిల్కనంపింది. బొడజూతువుగాని మేలుకో.

హృషీకేశ భువియందు ఋషులందరు వచ్చి కూర్చుని యున్నారు మేలుకో,
వచ్చినవారికి వరములు కావలె వైకుంఠవాసుడు మేలుకో.

పద్మనాభ నీదుపత్ని భాగాదులు వచ్చికూర్చున్నారు మేలుకో
పరతారకమైన పావననామము పాడుచువచ్చిరి మేలుకో,

దామోదరాయని దేవతలందరు దర్శింపవచ్చిరి మేలుకో
భూమిభారముమాన్న బుధులు' బోవ న రావె భూకాంతరముల మేలుకో.

సంకర్షణ! నీవు శత్రు సంహార మొసగ సమయమెయున్నది మేలుకో
పంకజాక్షులు నీదు పావననామము పాడుచువచ్చిరి మేలు కొ.

వాసుదేవా! నీకు భూసురపత్నులు భుజియింపదెచ్చిరి మేలుకో
భాసురంబుగ యాగ సంరక్షణ కొరకువర్ణింపుచున్నారు మేలుకో.

ప్రద్యుమ్నరూవుడ అర్జునవరదుడ దుర్జనసంహార మేలుకో
అబ్జవంశమునందు ఉద్భవించిన కుబ్జ్బ నాదరించినదేవ మేలుకో.

సశేషం.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.