గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జూన్ 2025, శుక్రవారం

అష్టదళపద్మబంధ మధురాక్కర గర్భ మత్తకోకిల రచన.... ఉప్పలధడియం భరత్ శర్మ. 16 - 5 - 2025.

జైశ్రీరామ్.

 అష్టదళపద్మబంధ మధురాక్కర  గర్భ మత్తకోకిల

రచన.... ఉప్పలధడియం భరత్ శర్మ.

మధురాక్కర లక్షణములు... 1 సూర్యగణము, 3 ఇంద్రగణములు, 1 చంద్రగణము.

యతి ... 4వ గణము మొదటి అక్షరము.

మా! యశేషజగద్గమా! జన మాన్యవైభవమూలమా! 

మాయఁ గాల్చు మహత్వమా! సిరి మాత! విష్ణుకళత్రమా! 

మా యమేయసుఖాంకమా! బుధ మాన్యసచ్చరితా! రమా! 

మా యగారము చేరుమా! నిను మాటి మాటికిఁ గొల్వమా!

చిరంజీవి భరత శర్మకు అభినందనలు.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.