గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జూన్ 2025, మంగళవారం

జీవన సత్యాలు .....శతకము..... రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

జైశ్రీరామ్.

 1,కం:-శ్రీ లాలిత్య మనోజ్ఞము

         చేలాంచల పీతవసన చిన్మయ రూపా!
         లాలీ లీలా లోలా
        కాలాంబుధి నీదు మమ్ము కావుమి కృష్ణా!

2. కం:-ప్రాలేయాచల కాంతుల
          మాలో గల తిమిర జాల మాత్సర్యములన్!
         ధీ లాక్షణ్యంబు నొనర
        మేలేలను రావలె హరి!మేథిని బ్రోవన్!

3.కం;-దివ మహములు భవ హరములు
         జవ సత్వము లుడుగు తుదికి !జీవిత మింతే!
        శివ సాయుజ్యము నొందగ
       భవ బంధపు టాశ మాను!పరమం బదియే!

4.కం:-చేత నచేతన మెరుగక
          భీతావహ చేతన మది!ప్రీతిని చెరచున్!
         మాతకు బోనము నిడకను
          ఘాతుక దుశ్చర్య నరుని కాజేయు గదే!

5,కం:-పురు షార్ధముల నెల్లను
         నరుడై పాటెంచ కున్న నాణ్యచ గనునే?
        కఠు ణెరుగని కాఠిన్యము
        మరణానికి దారి తీయు!మంచిని గనుమా!

6.కం:-సరివారి మేలు కోరుము
         సరసిజ నయనుండు మెచ్చి శాంతము నిచ్చున్!
        కరి వదనుడు తొలి దైవము
       పరి పరి రక్షించు మనల భాసుర లీలన్!

7.కం:-తాపానల నేత్రంబుల
         తాపంబే మరులు గొల్పు!తత్పర మౌనే!
         భూ పాలన విష్ణ్వంశము
         చేపన్వలె ధర్మ మవని శ్రీకర మలరన్!

8.కం:-కులములు జాతులు మతములు
          కొలమానము జేసి యేలు కువలయ మాయెన్!
         మెలికల తంత్ర ప్రయోగము
        బలిమిల హింసించు కొరకె!ప్రగతికి గాకన్!

9.కం:-కుల ద్వీషము మత ద్వేషము
         కలి మల చింతార్ధ మింతె!కాదన గలమా!
         తలపగ ప్రజ్ఞయె దిగుడగు!
        నిలు పోపునె?ధర్మ నిరతి!నేర్పు వహింపన్!

10,కం;-ధన దాహము మితి మీరెను
           మన నీయత మంట గలిసె!మార్భటి లోనై!
          కని విని యొరుగని రీతుల
         జన జీవన సాగె కలిని!జయ మిదె యనగా!

11.కం:-శూన్యము తత్వార్ధ మవని
            మాన్యము హింసే యనుకొని మసలెడి కలిలో!
            ధ్యానము శూన్యము గాదొకొ?
           తా న్యాయము కాటకంబె!తలప వదేలన్?

12.కం:-చేతన శూన్యుల మాటలు
            పాతాళము పెల్లగించు!పలుకుల నెలవై!
           భూతాత్మా!పరమాత్మా!
           జాతిం సరిజీయ రావె!సత్వర గతినిన్!

13.కం:- అమ్మయె జన్మము నిచ్చును
            కమ్మని మాతృత్వ మవని!కల్ములు స్త్రీలే!
           నిమ్ముల దూషణ సేయగ
          కమ్మదె?దోషార్తి !జాతి ఖ్యాతిం మాపన్!

14.కం:-మిడి మిడి జ్ఞానము ఘనమని
           పడి పడి పరభావ సరళి!పట్టక జనగా!
          కడి నెడమిడి కాలుడు తా
          మడియగ పాశంబు విసురు!మానవ కనవా!

15.కం:-తగు తగ జీవన భ్రాంతిని
           నెగ సెక్కెము లాడి పరుల నిందిల జేయన్!
          పొగ రడచును వడి పరముడు
          నిగ మెరిగి బ్రతుకు జగతిని!నేర్పరి వౌచున్!

16.కం:-ఛందో వార మపారము
            చిందించును బంధములను!చిత్రము కాదే!
            గంథమునౌ!గర్భ కవిత
            అందున్నవ ధాన కేళి!హర్షం బొదవున్!

17.కం:-హరు చరఞణాబ్జ రజంబది
           తరియింపగ జేసి జగతి!ధర్మము గాచున్!
          పరిమళ గంథము తరణయె
          కరుణా మయు డేలు మనల!కను సత్య మిదే!

18.కం:-మాయామేయ జగంబున
            మాయను సృజియించి మంచి మార్గము చూపున్!
           మాయా లోలుడు శ్రీహరి
           శ్రీ యశమున దీర్చి గాచు!శక్షేమం బరయన్!

19,కం:-పలు జన్మల పాపాలను
            విలువౌ!నర జన్మమున!విడువక తరుమున్!
            తెలివిలి పరమాత్ము గొలువ
            వెలయౌ!మోక్షంబు కుదురు!విశ్వేశు కృపన్!

20.కం:-మాటల మంచి తనంబును
           పాటున పరమార్ధ చింత!వదలక మనుమా!
          కోటలు పేటలు నిలువవు
          బీటులు వారును బ్రతుకులు!ప్రేమగ మనుమా!

21.కం:-మంచీ చెడు లవి రెండును
            సంచితమై వెతలు గూర్చు!సర్వుల కిలలోన్!
            అంచిత కీర్తి ప్రకీర్తులు
            మంచియె చేకూర్చు నంచు మరువకు మెపుడున్!

22.కం:-జ్ఞానాంబుధి నావవునై
            మానంబౌ!ధర్మ నిరతి మాన్యుడ వీవై!
           శ్రీ నామాంకిత మానస!
           ధ్యానంబున మున్గి తేలు!ధన్యుడ వౌచున్!

23.కం:-పరిమళ గంథము భూమిది
            వరదారుణ కాంతి పుంజ వర్ధిని!ప్రభలన్!
           పరిహాసము సరి గాదయ!
           తరియింపుమి ముక్తిమార్గ తత్వం బలరన్!

24.కం:-శిష్టులు యిష్టము నా కని
           కష్టంబుల తోడు పడక!కల్లల మెల్గన్!
           భ్రష్టుండగు భూ తలమున!
           స్రష్టయు మన్నింప డతని!చైదం బులకున్!

25.కం:-మాతల నవమానింపగ
           చేతనముల చేటు గూర్చు!జీవిత మంతన్!
           ఘాతుకము లలము కొనగా
           మాపయె దరి జేర వెరచు!మత్తును విడుమా!

26.కం:-తాతకు దగ్గులు నేర్పగ
           భూతము లవి పోతరించి పురములు గాల్చున్!
           నీతికి తావే నేనని
           చేతనముల నరయు పరము!చిన్మయ మలమన్!

27.కం:-పోరును నష్టము గూర్చును
            జీర కనర్ధములు సుగుణ!శ్రేయము గనుమా!
            సారెకు సారెకు నిన్నే
           చేరుచు పరమాత్ము దరికి!శ్రీ హరు డొకడే!

28.క:-సృష్టికి మూలము నే నని
         భ్రష్టాత్మం దలప బోకు!భంగుర పడెదే!
         అష్టమ శని దోషంబున
         కష్టములకు నిలయు డౌదు!కాలుడు మ్రింగున్!

29.కం:-వరమత జీవన మందియు
           గురు తెరుగని జీవ యాత్ర!కొమరునె సుఖముల్!
          తిరవెరిగి మసలు జగతిని
          సరి సరి పరములు దివురును క్షేమం బలరున్!

30.కం:-కోరుమి సర్వుల శ్రేయము
           మీరకు గురు నాన నెపుడు!మేలు నటంచున్!
           తారక నామం బెంచుము
           శ్రీ రాముడె రక్ష నీకు!జీవన ధాత్రిన్!

31.కం:-సమ సామ్యంబే!భేషన
           తమ స్వార్ధంపు టెలమి!తధ్యము కనగా!
           కమనీయంబౌ "ఓట్లచె,
           మమతల భేదంబు గూర్చి!మన న్యాయమొకో?

32.కం:-పలు మతములు,జాతులు గల
            విలువగు భరతామ తల్లి పేలవ మేర్చన్!
           పలు పథకాలను పేరున
           నిలు వెత్తున ముంచుట గును!నీతిని దలపన్!

33.కం:-పనిని కలిగించి ధనమును
            జనుల కిడగ న్యాయ మౌను!జవమది.పెరుగున్!
           మనుకలి రూకలు పంచగ
           గను లైనను.తరుగు నంచు!గన నేర రదేమో?

34.కం:-కష్టమె నిలువదు ధాత్రిని
           యిష్టంబని రూక లీయ!హేయము గాదే!
           కష్టము పడ జేసి జనుల
           నిష్టను బ్రతికింప చూడ!నిండును కాదే!

35.కం:-అన్యాయంబుగ ధనమిడి
           ధన్యంబును చెరచివైచిక!తారక మనుచో!
           మన్యంబులు మంట గలియు
          సన్యాసుల జేయ నేనె?జగతి జనంబున్!

36.కం:-పేదలు శ్రమ జీవులు భువి
            సాధక బాధకము లలర!జడియరు ధృడతన్!
           నీ ధన మేలను?వారికి
           ఏ దానము కోర రవని!నీశ్వరు కరుణన్!

37.కం:-ఓటుకు నోటును ముడి యిడి
            ధీటుగ పథకాలు పేర!తెలి వరు లౌచోన్!
           పోటీని గెలుచు మార్గము
           చేటు గదే!భరతమాత శ్రేయో థృతికిన్!

38.కం:-ఓట్లే!ధీటౌ పాలన
            పాట్లే పరమార్థ చింత!భావన గనునే!
            కోట్లాశే!నీతి చెరచు!
            పోట్లాట లవేటి కయ్య?భూప వరాశీ!

39.కం:-భృతి గూర్చి జగతి బ్రోవగ
            స్తుతి పాత్ర నంద గలరు!శ్లోకులు నౌచున్!
            సృతి తప్పి గతిని మార్చిన
            గతియే దూరంబు నౌను!గడగుడి నీతిన్!

40,కం;-ప్రత్యేకత కుల మలమిన 
            నిత్యంబౌ ప్రజ్ఞ  దెల్ల!నీరస పడగా!
            గత్యే ప్రతి కూలమునౌ!
            ధృత్యంబులు కీడు నలరు!తెలివిలి మనుమా!

41,కం;-కష్టించి పనిని జేయుమి
           ఇష్టంబౌ దైవచింత!హితకర మేర్చున్!
           ముష్టిని యడుగకు నితరుల
           పుష్టిం శ్రమ జీవ మెంతొ?శివ మేర్చు గదే!

42.కం:-శ్రద్ధా బుద్ధులు కలుగగ
           బద్ధక మెడమేర్చి దీక్ష!పట్టును విడకన్!
           నిద్దుర పోయిన సరె మది
          పద్ధతి నవలోకనంబు ప్రజ్ఞను పెంచున్!

43.కం:-మందత తగదుర బాలా!
            సుందర వదనారవింద సోయగ మలరన్!
           ముందుండు చదువు లందున
          గంథము వెదజల్లు ప్రజ్ఞ!గంధర్వుడవై!'

44.కం:-కోరక  పండ్లిడు తరువులు
            నేరుగ పారు జలంబులు!నెవ రడు గకనే!
            వారిని మేఘుడు నొసగును
             తారకు దయ!కోరకున్న ధరణిలొ!బాలా!

45.కం;-గురి తప్పని దీక్షా రతి
            మరిమరి ప్రశ్నింప బడని మాన్యత కనగా!
            నిరతము చదువగ జ్ఞానము
           గురుతర మేర్చును!బ్రతుకున !కూరిమి మీరన్!

46.కం;-ప్రత్యేకత నిత్యంబై
           స్తుత్యంబౌ జగతి ప్రగతి!శూన్యం బేర్చెన్!
           గత్యేమి లేక ప్రగతియె
           నిత్యం నాశంబు నేర్చె!నెమ్మది నెంచన్!

47.కం:-ప్రజ్ఞకు కుల మద్దిరి యిట
            అజ్ఞానత ప్రగతి నెడమిడి హంతము జేయన్!
            విజ్ఞుల సామర్ధ్యమునకు!
            సుజ్ఞూనుల యండదండ చొప్పడ వలెగా!

48.కం:-దప్పర మొప్పగ భూతలి
            కుప్పలు కుప్పలుగ ధనము కోరుట వలనన్!
            ముప్పులు తప్ప వదెప్పుడు
           చిప్పలు జనమంది మనగ శ్రీ లేల నయా?

49.;-కం;-పూరిని మేసెడి పశువై
              ధారుణి మేయంగ జూడ!తప్పేను సుమా!
              కోరకు కాలుని హింసలు
             చేరుమి పరమాత్ము భక్తి!చింతాత్ముడవై!

50.కం;-కాలము వడి గమియించును
            జాలము నేలంగ చతుర జాగృతి వలయున్!
           బేలత పనిమాలిన పని
           కాలాంతక మేర్చు నవని!కనవా!వినవా!

.51.కం:-జనములు జారులు గారయ!
             మన నీయులు మాన్య ధనులు!మాటల మంచిన్!
            కని విని పదవుల నెడెదరు
           ఘను డేనని విర్రవీగ!కాలము దీరున్!

52.కం;-వాచా కర్మణ దోషమె
           నీచాలత నీల్గ జేయు!నిక్కము సుమ్మా!
          శ్రీ చారు మనోజ్ఞత గను
         తూచా రక్షింప బడెదు!తోరపు భక్తిన్!

53.కం;-కారణ జన్ముడ నేనని
           తారలకే!తార నంచు థర్పము నూనన్!
          మారణ హోమము తథ్యము
         తీరుగ కష్టాలు గొనకు!తెలివరి వౌచున్!

54.కం;-కులమే మైనను సరె!
            తలపుల దిగు డెంచకు మది!తప్పుల కొప్పౌ!
            కలి ఘోరాలకు నెలవౌ!
           విలువౌ!జీవాల వేథ!వేధే గూర్చున్!

55.కం:-చిమ్మట జీవన మేటికి?
            కమ్మటి పురుషార్ధ సార!కల్ముల గనుమా!
           తమ్ముల నిలయుబు బలెన్!
          కమ్మటి గాంభీర్య గరిమ!గైకొను జీవా!
                (తమ్ములు=పద్మములు)

56.కం;-క్షీరము నీరము వేరిడు
           పారంబౌ!హంస ప్రజ్ఞ!పట్టగ నౌనే?
          తీరగు మాటల సారము
         సారాంతర్గత సు శోభ!చతురత గనుమా!

57.కం:-అందపు బంధము జీవము
            మందత విడనాడి!మనుమా!వసుధన్!
            కుందక ధైర్యాన వరల
           పొందెదు సుఖ శాంతు లెలమి!పూజ్యం బలరన్!

58.కం:-జననము మరణము లనునవి
            మను ధర్మముగా నెరుంగు!మాయది యింతే!
            కని విని యెరుగని యిడుమలు
           వినుతింపంబడు దినములు!వే వేగ జనున్!

59.కం:-నీటి బుడగ జీవిత మిది
           వాటము చెడి పగులు నెపుడొ?వలయను తరమే!
           చేటును గోరక రాముని
          పోటీ పడి కొల్వ ముక్తి నొందెదు!వరదా!

60.కం:-అంతము లేదిల చదువుకు
           పంతంబున పెచ్చు నెంతొ?పట్టు ఘటించున్!
          చింతన మెంతైనా సరె!
         కొంతే సాధింపనౌను!కువలయ మందున్!

61.కం:-పడి లేచు కెరట మట్టుల
           నడయాడును జీవ కర్మ నర్మం బింతే!
           సుడి గుండము లెన్నైనను 
          జడియక జను ధీరత!వర జంగము కృపతోన్!

62.కం;-కుడి యెడమల తేడా గను
            గడి మీరకు ప్రభుని యాన!కైవల మదియే!
           నెడమిడకు సాటి వారిని
           కడి దూరము గాక కాచు!కమలాలయయే!

63.కం:-తెలియక జేసిడి పాపము
            మలి మలి జేయంగ తగదు!మాన్యత చెరచున్!
           కలి ప్రభలు కమ్మ నీకుమ
           మలిదుల దూరంబు నిడుమ!మంచియు కలుగున్!

64.కం:-చందన గంథమె గంధము
            గంథము రతనాల సీమ గాంధర్వ మదే!
           బంధుర సింధుర తిలకము
           అందము సుర గంధి!కమల హాసము కాదే!
65.కం:-ఛందో వరాంగి సుందరి
            మందిర మందవధాన కేళి!మార్మోగంగన్!
            ఛంధో గంథము లలరును
           వందితమై తెల్గు భాష వైభవ మొప్పన్!

66.కం:-మంధుడు కాడాంధ్రుడు భువి
            గ్రంధాంతర్గత సు భావ గరిమ!గాసిలు జ్ఞానై!
           ఛందో విన్యాసములన్!
           ముందుండెడు ధీరు డవని!ముచ్చటిలంగన్!

67.కం;-వర్ధిత జ్ఞాన సుమాంజలి
           కర్దము మది నెంచి మించు!కారుణ్యమునన్!
          వ్యర్ధము జేయక కాలము
         సర్దుకు పోవును సుగుణత!సత్యత పుడమిన్!

68.కం:-పర మొదవు పదవు లొందుచు
            పదిలంబుగ సత్య నిరతి!పాటును పడుచున్!
            సదమల దీక్షను వెలయగ
           మెదలన్వలె మాన్యుడౌచు!మీరక నీతిన్!

69.కం:-నీతికి నేతా మెత్తెడి
           జాతిర మన తెల్గు జాతి!జ్ఞాన నిధానా!
          చేతన పర శ్రేయముగా
          ఖ్యాతిం గడియింప మనుమ!కమ్మటి మనమున్!

70.కం:-చేగల కార్యము లెల్లను
           వేగము చేయంగ వలెను!విసగక నీతిన్!
           కాగల కార్యము లెల్లను
          జాగొనరక జేయు!భవుడు!చతురుడు సుమ్మా!

71.కం:-రిక్కలు లెక్కిలు శాస్త్రము
           మక్కువ జోతిష్య మెల్ల మనదై యొప్పన్!
          చక్కటి భవితా జ్ఞానము
         మిక్కుటమై భువిని వెలయ!!మేలు ఘటించెన్!

72.కం;-శ్రీరామామృత ధారలు
           పారంబౌ జ్ఞాన ప్రభలు!పరమం బేర్చున్!
           వేరేల?రామ మారయ!
          జీరం సర్వార్ధ భరిత!శ్రేయం బలరున్!

73,కం;-జ్ఞానము పండిన మాన్యుడు
           తా నెంచియు పరుల శక్తి!తగు తగ నలరున్!
          తానే!గొప్పని దలచెడి
           ధీనుడు నతమౌను గాదె!తెలివియు లేమిన్!

74,కం:-తెలివగు మార్గము కనుగొని
           విలువౌ!నర జీవనంబు!విలువల నెలవై!
          కలికాల నడత గావలె!
         ములుకులు పరహింస చరుల!మోసము గనుచున్!

75.కం;-చదివితి నాకేమని యని
            వదలకు చదువౌర!జ్ఞాన భాగ్య మదేరా!
           చదివిన జీవిత మంతయు
           కొదువేయౌ!జ్ఞాన వార్ధి కొలువగ తరమే!

76.కం:-ముందెరిగి మసలు కొనవలె
            అందందున ముండ్లు యుండునాలోచింపన్!
           డెందము పరవశ మొనరక!
           చిందించుమి నీదు ప్రజ్ఞ!చిన్మయ రూపా!

77.కం:-ఉబ్బకు గుబ్బెత చూపుల
           కబ్బుర పడబోకు!కలిమి కాశల నెలవై!
          నిబ్బర మూనుచు భవితను
          సుబ్బరముగ తీర్చి దిద్దు!సోముని దయచేన్!

78.కం:-లోటును లేనటి మనుజుడు
            బీటులు వారని కమతము!పేలవ మేగా!
            పాటునుపడ లోటుండదు
           కాటక మొదవని జలముల!కమ్మగ పండున్!

79.కం:-ఘటనా ఘటన సమర్ధుడు
           కుటిలుర పోరాడి తరిమి!కుతలపు ధర్మమ్!
           పటుతను నిల్పును శ్రీహరి
          వట సాయిగ జగతి ప్రగతి!వసుమతి మెచ్చన్!

80.కం:-వసువొసగు వసుధ మేలును
           వెస నస దృశ క్షీరదముల పేర్మిని గనుచున్!
           పసగల నర జన్మంబున
           దొసగొసగక ధర్మ నిరతి!దొరకొన మనుమా!

81.కం:-బంధము కవితకు నందము
            మందారము గర్భ కవిత మాధురు లెలమిన్!
           సుందర చిత్ర కవిత్వము
          విందగు సుర వాణి ప్రభలు!విశ్వము నింపున్!

82.కం;-దానము ధర్మము మానకు
           మీనాశ్రిత శుక్ర ఫలము మేధిని కనగా!
          ధీనోద్ధారణ మోక్షము
          కానం గాసెడి జ్యోత్స్న కాబోకు మయా!

83.కం:-ధన కనక వస్తు ఛము లవి
            తన వెంటను రావు సుమ్మ!తనువే మాయున్!
           కన కలి నీతి విరాజికి
           దినకరు ప్రార్ధింప జవము తేజం బలరున్!

84.కం:-కల నైన చెడును తలపకు
           విలువౌ విజ్ఞాన జలధి వెలుగుమి యనఘా!
           బలు పది ధనమున కల్గునె
          బలుపౌ నిస్వార్ధ చింత!భాగ్యం బదియే!

85.కం:-నాటకు విష బీజము లిల
           చేటుకు సుగమం బు నగును!చెడు జీవితముల్!
           కూటికి గుడ్డకు నెడమగు
          పూటకు బత్తెంబు లేక !పోదురు పైకిన్!

86.కం:-గ్రహ దోషపు ప్రభ తప్పదు
           బహు ప్రజ్ఞల వెల్గు లొప్పు వారల కైనన్!
          యిహ పర సుఖములు బడయగ
          రహిమించి వెలుంగు రాము!రక్షే!దక్షౌ!

87.కం:-ఇరు పక్షంబులు కావలె!
           పరిపాలన సరిగ నడువ!పాలన మందున్!
           పరువలరు వాదనం బది
           సుర పాలన యనబడ భువి!శోభిల్లు గదే!

88.కం:-చింతిల కలిమి యనంతము
           తంతువు చివరేది?కలిమి తంత్రం బెంచన్!
           వింతగు దంతపు కోరల
          జంతర మంతర తతంబు!జాగృతి మనుమా!

89.కం:-తన బ్రతుకు తనకు దెలియక
            ఘన ధీరుడ నేనటంచు!కల్లల బ్రతుకన్!
           తన వెనుక తిరుగు వారలె
          మననీరిల ధన వరాశ!మను తెలివి భువిన్!

90.కం:-పరుషము లాడెడు పురుషుడు
            పురుషోత్తము డైన గాని!పూజింతు రొకో?
           నిరసన సెగ లెగసిన తరి
           తరుముదు రవలీల జనులు!దర్పము మాయన్!

91.కం:-చరితార్ధ జీవనంబున
            పరుషములకు లేదు తావు!పౌరుష పడకన్!
           పురుషార్ధ సాధనంబున
          నిరతము పచరించి రాజ నీతిని మనుమా!

92,కం:-దేదీప్యమాన కాతుల
           ధీ దితు లెలయంగ!రాజ్య దీప్తులు వెలయన్!
           మోదింతురు జన సమస్తము
          బోధానపు విద్య లరసి!పూజ్యత గనుమా!

93.కం:-ఏకాగ్రత మతి కావలె
           రాకాశాసలు విడ వలె!రాజిల ధాత్రిన్!
          నాకా న్నే!నాకె దనన!
         చీకును చింతలును గల్గు!జీవిత మందున్!

94.కం:-ఇచ్ఛకు నచ్చిన యట్టుల
           తుచ్ఛముగా పాలనంబు తూచా జేయన్!
           మెచ్చరు స్వేచ్ఛా జగతిని
           కచ్ఛితమౌ దక్షుల కిల!గౌరవ మలరున్!

95.కం:-తెలివరి నని మిణుగురులతొ
            చలి కాచు కొనెద ననియెడు!చవటల పదవుల్!
           తెలివిగ పీకెదరు వడిన్!
           కలతల నెలవై మసలకు!కమ్రత చెడగన్!

96.కం:-ఇందనము లేని యంత్రము
           మందత నలరారి మెదడు!మంద్రత నేర్చున్!
           కందెన లేని రథమ్మును
           కందర్పుడు కదప గలడె!కనవా!జీవా!

97.కం;-మాంసము రక్తపు త్వగ మిది
           హింసాత్మక జీవ సరళి!హేయము కాదే!
          సంసారమె!మాయం జను
         కంసారియె కాచు జగము!కైవలదముడై!

98.కం:-నవ సంఖ్యాత్మక లోకము
            భవ బంధ విమోచనకును! బంధము లిడగా!
           అవధులు మీరిన నడకది
          భువియందున బూధి కాదె?పుర రిపు కేళిన్!

99.కం:-భూదియె!శిష్ట విశిష్టము
           భూదియె సర్వార్ధ రక్ష!పుణ్య ధరిత్రిన్!
          భూదే!పరమార్ధంబుర
         భూదిని విడనాడ కెపుడు?పురుషా!హర్షా!

100.కం:-జగముల నాటల నాడును
              నిగమాగమ  సూరి హరుడు!నేరిమి మీరన్!
              నిగ నిగ లాడెడు బొమ్మలు
             తగు తగ నాడించి చిదుము!ధర్మము నిల్పన్!

101.కం:-లక్షణ లక్షిత గుణ ఖని
              దక్షత పాలించి జనుల!ధర్మము చెడగా!
              తక్షణమె!లయము చేయును
             శిక్షా స్మృతి నమలు జేసి!శివుడే!లయుడై!

102.కం:-మేనను భూదిని నలిమితి
              మానవుల విభూతి పంచి!మంచిని గంచున్!
              ధీన దయాళుడ వైతివి
             నీనామంబే!శివమట!నేలుమి మమ్మున్!

103.కం;-తెర వెరుగని జీవంబున
             మెరు గెరుగని చలన మనగ!మెరుపే వరలన్!
            చిరు దీపము వెలుగు కనగ
            పరి పరి ధ్యానించు శివుని!భద్రత కనగా!

104.కం:-పెంజీకటి కావల గల
             సంజీవన సరళిగూర్చు!సద్గురు వరునిన్!
            కంజాత సుమ రుచిరున్
           రంజిల కీర్తింతు!ముక్తి!రక్తి దలిర్పన్!

105.కం;-చక్కటి పద జాలంబుల
             మిక్కుటమౌ!హరి పధంబు!మేలు ఘటింపన్!
            మక్కువ కీర్తింప మనసు
            నిక్కువ శ్రీ పధము దనర!నెమ్మది గొల్తున్!

106.కం;-యోగము లేదిల జగతిని
              శ్రీగంథము దరికి జేర!సిద్ధత లేదే!
             ధీ గుణ గరిమాదు లమర!
            రాగదె ధీనార్తి బాప!రంజిత నయనా!

107.కం:-వాణీ వీణా పాణీ!
              కాణాచీ విల చదువుల!కమ్ర మనోజ్ఞీ!
              వాణీ పుస్తక పాణీ!
             పాణిం వరదాలు చిమ్ము!వనజుని రాణీ!

108.కం:-బుడి బుడి నడకలు నడచుచు
              వడి వడి బడి కేగి చదువు!బాలుర నీవే!
              నడిపించి చదువు లిమ్మా!
              పడతిరొ!చదువుల వరాళి!భారతి!మాతా!

         
                          ఫల శ్రుతి
 
     కం;-వినయ విధేయత లలరును
          మననీయపు ఖ్యాతి గల్గి!మాన్యత బొడమున్!
          మన జాతి తెలుగు జాతని
         ఘన విద్యలసారమెరిగి!గడగుత!నిలమిన్!

                      మంగళమ్ మహాత్
                         శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ,


గద్యము:-ఇది శ్రీమదు భయ భాషా భూషణవిద్వద్వరేణ్య,శ్రీ వేంకటరాయ శాస్త్ర్రి
వరేణ్య ప్ర పౌత్ర,సారస్వతీ కృపా పాత్ర కాశ్యపస గోత్ర పవిత్ర వల్లభవఝల సంజ్ఞా
పయః పారావార రాకా సుధాకర,నరసింహ వరేణ్య పౌత్త,శ్రీరామ మూర్తి,నారాయ
ణాంబ గర్భ శుక్తి ముక్తా ఫలాయ మాన,సోదర,సోదరి ,సమన్విత.సుధీ విధేయ
అప్పల నరసింహ మూర్తి,శర్మ,నామ ధేయ విరచిత"జీవన సత్యాలు"-కృతి
సమాప్తమ్,
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.