జైశ్రీరామ్.
మాచవోలు శ్రీధరరావు.
పద్యము సందర్భము.
(పెద్ద వారైన ఇద్దరు మిత్రులలో ఒకరు మరొకరితో పల్కిన మాటలు).
"అష్టదళ పద్మ బంధ మధురాక్కర గర్భ భావగోపన చిత్ర మత్తకోకిల" వృత్తము.
మాకు మీకును వియ్యమా (యను ) మాట లేలను మిత్రమా
మాకు మీకును సామ్యమా (యన) మాది మీదొక వంశమా
మా కుమారుని వైన మా(రిన) మాటలన్ గణియింపుమా
మాకు మీరలయిష్టమా (సఖ) మా గతుల్ గ్రహియింపుమా!
మత్తకోకిల గర్భస్థ "అష్టదళ పద్మ బంధ మధురాక్కర.
లక్షణములు. 1సూర్య - 3 ఇంద్ర - 1 చంద్రగణము ప్రతీపాదమున వచ్చును.
యతి4వ గణము మొదటి అక్షరము....ప్రాసనియమము కలదు.
మాకు మీకును వియ్యమా మాట లేలను మిత్రమా
మాకు మీకును సామ్యమా మాది మీదొక వంశమా
మా కుమారుని వైన మా మాటలన్ గణియింపుమా
మాకు మీరలయిష్టమా మా గతుల్ గ్రహియింపుమా!
అష్టదళ పద్మ బంధ మధురాక్కర.
ధన్యవాదములు,
-మాచవోలు శ్రీధరరావు.
నా సూచనలను గ్రహించి అత్యద్భుతముగ చిత్రబంధ గర్భ కవిత్వమును వ్రాసి
నాకు ఆనందము కలిగించిన ఆధునిక కవికోకిల శ్రీ మా.శ్రీ. గారికి అభినందనలు.
జైహింద్.
2 comments:
నమఃపూర్వక ధన్యవాదములండి 🙏🙏
అభినందనలు మాశ్రీ గారికి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.