జైశ్రీరామ్.
శ్లో. సర్వకాలే సనా ప్రోక్తా - విద్యమానస్తనేపిచ,
సర్వత్ర సర్వ కాలేషు - విద్యమానః సనాతనః.
తే.గీ. సనకు సర్వకాలములంచు చక్కనెఱుఁగు,
తనకు శాశ్వితంబుగనుండు నని గ్రహించు,
సర్వకాలాలనంతటన్ సరిగనుండు
నదిసనాతన ధర్మంబు మదిని గనుఁడు.
భావము. సర్వత్ర, సర్వకాలములయందు సనాతనధర్మం శాశ్వతమైనది ఉండేది.
సనా=సర్వకాలములయందు సర్వావస్థలయందు,
తన=నిలిచి ఉండేది.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.