జైశ్రీరామ్.
శ్లో. కృతజ్ఞేన సదా భావ్యం - మిత్రకామేన చైవహl
మిత్రాచ్చ లభతే సర్వం - మిత్రాత్పూజాం లభేత చll
(మహాభారతమ్ - శాన్తిపర్వము)
తే.గీ. భువి కృతజ్ఞతతోనున్న పూజ్యులైన
వారి మైత్రి సంప్రాప్తమౌ, వారివలన
లభ్యమగుచుండు సర్వమున్, లభ్యమగును
గౌరవంబు, సత్ కీర్తియున్, ఘన సుచరిత!
భావము. "మంచి మిత్రులను కోరుకునే వారు సదా కృతజ్ఞునిగా ఉండాలి.
మంచి మిత్రుని వలన సమస్తమూ పొందుతారు. మిత్రుని సహాయం వల్లనే
లోకంలో గౌరవం పొందుతారు".
జైహింద్
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.