శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
చిత్రకవితాసమ్రాట్ బ్రహ్మశ్రీ చింతా రామకృష్ణారావు గారికి
*పుంభావభారతీ*
బిరుదు ప్రదానము తే.19.10.2024ని చేయుచు
పంచరత్నములు.
కం. చింతా యను పద భావమె
చింతించుట యగును, మీరు చిత్తమునందున్
సంతతము చింత చేయుచు,
సంతసమున కావ్యమల్లు శక్తుండయితే.
కం. ఎన్నని వ్రాయుదురయ్యా!
ఎన్నగ మీ ప్రాయ మెంత? యెసగెడు చిత్తం
బున్నట్టి శక్తి సంపద
లున్నట్టి శరీర బలము లునికిన్ గనుమా!
కం. పద్దెములెన్నివిధంబులొ
యద్దెస మీ గమనముండు, నాలోచనముల్
తద్దిశ మెరయున్ గావ్యం
బొద్దికతో వ్రాయబోదురొక్క క్షణానన్.
కం. *పుంభావభారతీ* యని
సంబోధనతోడ మిమ్ము చక్కగఁబిలుతున్
బింబోష్ఠివాణి ఘనధీ
సంబంధయుతుండవౌట సత్కవివర్యా!
కం. సొంపగునీ బిరుదమ్మున్
సొంపుగ నే నిచ్చుచుంటి సుందరమతితో
న్నింపుగ నను మన్నించుచు
కెంపుల మీ బిరుదపంక్తికిన్ జతనిడుడీ!
స్వర్ణ కంకణ-కవిగండ పెండేరపు సత్కార గ్రహీత.
విద్వాన్ చక్రాల లక్ష్మీకాంతరాజారావు. ఎం.ఏ.,
విశ్రాంత సంస్కృతాంధ్రోపన్యాసకులు. హైదరాబాద్.
విద్వాన్ బ్రహ్మశ్రీ చక్రాల లక్ష్మీకాంతరాజారావు మహోదయులకుకృతజ్ఞతాభివందనములు.
శా. శ్రీమన్మంగళ భావనామృతభరశ్రీజ్ఞానతేజోనిధీ!
శ్రీమద్భారతి ముద్దుబిడ్డలగు లక్ష్మీకాంత రాజాఖ్య! మీ
శ్రీమంతంబగు భవ్యభావ విలసచ్చిద్రూప వాగ్వైఖరిన్
ధీమంతుల్ గణియింతురయ్య! మిము నేతీరున్ బ్రశంసించెదన్?
మీకు
కృతజ్ఞతాపూర్వక వందనములు
సమర్పించుకొనుచున్నాను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.