గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఏప్రిల్ 2022, శుక్రవారం

సర్వాణీన్ద్రియకర్మాణి .. || 4-27 ||..//..ద్రవ్య యజ్ఞా స్తపో యజ్ఞా..|| 4-28 ||..//..జ్ఞాన కర్మ సన్యాస యోగము.

 జైశ్రీరామ్.

|| 4-27 ||

శ్లో. సర్వాణీన్ద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే|

ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే.

తే.గీ. జ్ఞాన, కర్మేంద్రియంబుల కర్మములను

సంయమాగ్నిలో వేల్తురు సంయమివరు

లిట్లు కొంద ర, రయు మిదియె ఘనము గన,

ఆత్మసంయమనంబది యనుపమమిట.

భావము.

మరి కొందరు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ కర్మ లన్నింటిని జ్ఞానంతో 

వెలిగింప బడిన మన స్సంయమన మనే అగ్నిలో వేల్చుతారు.

|| 4-28 ||

శ్లో. ద్రవ్య యజ్ఞా స్తపో యజ్ఞా యోగయ జ్ఞాస్తథాపరే|

స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః.

తే.గీ. కఠిన యత్నంబుతో ఘనుల్ జ్ఞాన, ద్రవ్య,

యోగ, స్వాధ్యాయ, సత్తపో యుక్త యజ్ఞ

ములను కల్గి యుందురిలను పూజ్యముగను,

నీవు గ్రహియింపుమర్జునా! నియతితోడ.

భావము.

మరికొందరు కఠినమైన నియమాలతో ప్రయత్నం చేస్తూ ద్రవ్య, తపో, 

యోగ, స్వాధాయ, జ్ఞాన యజ్ఞాలు కలిగి ఉన్నారు.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.