గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఏప్రిల్ 2022, శనివారం

ప్రలపన్విసృజన్గృహ్ణన్ను..|| 5-9 ||..//..బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గం..|| 5-10 ||..//..పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః

జైశ్రీరామ్.

|| 5-9 ||

ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి|

ఇన్ద్రియాణీన్ద్రియార్థేషు వర్తన్త ఇతి ధారయన్.

తే.గీ. మాట లాడునప్పుడు, వీడి మనునపుడును,

పట్టుకున్నప్డును, కనురెప్ప పడి తెరచు

నపుడు నింద్రియముల్ విషయముల సంచ

రించుట నెరుగు, నిజమునే, యెరుగు తాను.

భావము.

మాట్లాడుతున్నప్పుడు, వదిలేస్తున్నప్పుడు, పట్టుకుంటున్నప్పుడు. 

కనురెప్ప మూసి తెరచునప్పుడు, ఇంద్రియముల విషయమున 

సంచరించుట తాను గ్రహించును.

|| 5-10 ||

శ్లో. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గం త్యక్త్వా కరోతి యః|

లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా.

తే.గీ. బ్రహ్మ కర్పించి కర్మలన్, భక్తి గలిగి,

సంగ భావంబు వీడిన సన్నుతు లిల

నీట తామర తడవని వాటమునను

పాప మంటక శుద్ధులై వరలుదురిల.

భావము.

ఎవరైతే కర్మలను బ్రహ్మమునకు అర్పించి, సంగభావాన్ని వదిలి 

పనిచేస్తారో, అట్టివాడు నీటిలో ఉన్న తామరాకు ఎలా నీటివలన 

తాకబడదో అలాగే పాపం చేత తాకబడడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.