గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

యోగయుక్తో విశుద్ధాత్మా.. || 5-7 ||..//..నైవ కిఞ్చిత్కరోమీతి యుక్తో..|| 5-8 ||..//..పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః

జైశ్రీరామ్.

 || 5-7 ||

శ్లో‌. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేన్ద్రియః|

సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే.

తే.గీ. కర్మ యోగమ్మునన్ గూడి, నిర్మలమగు

చిత్తముండి జితేంద్రియ సిద్ధులిలను,

తెలియుదురిల నాత్మ వలెను దీపితమగు

పరుల యాత్మలన్, జిక్కడు బంధములకు.

భావము.

కర్మ యోగంతో కూడుకొని, విశుద్ధం ఐన బుద్ధితో మనస్సు, ఇంద్రియాలను 

జయించి, అన్ని ప్రాణులలోని ఆత్మను తన ఆత్మగా తెలుసుకున్న వాడు 

కర్మలను చేసినా బంధంలో చిక్కుకోడు.

|| 5-8 ||

శ్లో. నైవ కిఞ్చిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్|

పశ్యఞ్శృణ్వన్స్పృశఞ్జిఘ్రన్నశ్నన్గచ్ఛన్స్వపఞ్శ్వసన్.

తే.గీ. సత్య మెరిగిన యోగి తా సతము గనుచు

చూచుట, వినుటయును, స్పృశించుటయు, గాలి

పీల్చుట, తినుట, వాసన పీల్చుటయును

నిద్రయును, తాను చేయమిన్ నిరత మెరుగు.

భావము.

పరమసత్యాన్ని ఎరిగిన యోగయుక్తుడు చూస్తున్నప్పుడు, 

వింటున్నప్పుడు, స్పృసిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, 

తింటున్నప్పుడు, పడుకుంటున్నఫ్ఫుడు, ఊపిరి పీలుస్తున్నప్పుడు

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.