జైశ్రీరామ్.
|| 5-3 ||
శ్లో. జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాఙ్క్షతి|
నిర్ద్వన్ద్వో హి మహాబాహో సుఖం బన్ధాత్ప్రముచ్యతే.
తే.గీ. కనగ నద్వేషియు విముక్త కాంక్షు డిలను
నిత్యసన్యాసి, కనుమిది నీవు పార్థ!
ద్వంద్వ భావరహితుడిట బంధముక్తు
డగును, నిజమిది భువిపైన సుగుణధామ!
భావము.
ఎవరైతే ద్వేషించకుండా, కాంక్షించకుండా ఉంటారో, అతడే
నిత్యసన్యాసి అని తెలుసుకో. ఓ మహాబాహూ! ద్వందాలు లేనివాడే
బంధాల నుండి తేలికగా విడుదల పొందుతాడు.
|| 5-4 ||
శ్లో. సాఙ్ఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదన్తి న పణ్డితాః|
ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విన్దతే ఫలమ్.
తే.గీ. సాంఖ్య మని యోగ మని యంద్రు చంటివా
పెద్దలట్టుల పల్కరు విజ్ఞులగుట
నెవ్వరారెంట నొకదాని నెన్ని నిలుతు
రట్టి వారికీ రెండును నమరు పార్థ!
భావము.
పసివారు (అజ్ఞానులు) మాత్రమే సాంఖ్యమూ, యోగమూ వేరు వేరు అని
అంటారు. విద్వాంసులు అనరు. ఎవరైతే ఒకదానిలో సరిగా నిలబడ్డారో
అతడికి రెండింటి ఫలం దొరుకుతుంది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.