గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఏప్రిల్ 2022, గురువారం

యథైధాంసి సమిద్ధోగ్నిర్భస్మ..|| 4-37 ||..//..న హి జ్ఞానేన సదృశం ..|| 4-38 ||..//..జ్ఞాన కర్మ సన్యాస యోగము.

జైశ్రీరామ్.

|| 4-37 ||

శ్లో. యథైధాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్కురుతేऽర్జున|

జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా.

తే.గీ. కట్టెలను కాల్చు జ్వలితాగ్ని, యట్టులేను

జ్ఞాన రూపాగ్ని కర్మలన్ గాల్చివేయు,

ఘనతరంబగు జ్ఞాన సంస్కారి వగుమ,

కర్మలన్ బాసి శుభములే కనుము నీవు.

భావము.

అర్జునా జ్వలించే అగ్ని కట్టెలను కాల్చినట్లుగా, జ్ఞానమనే అగ్ని 

కర్మలను కాల్చివేస్తుంది.

|| 4-38 ||

శ్లో. న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే|

తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విన్దతి.

తే.గీ. జ్ఞాన మట్లు పవిత్రమై కలుగదన్య

మరయ, నిజమిది, సుజ్ఞాని నిరుపమముగ

పొందు తనలోనె జ్ఞాన మున్, సుందరముగ,

నీవునట్టులే పొందనౌ నెర్పుమీర.

భావము.

జ్ఞానం లాగ పవిత్రమైనది ఇంకొకటి లేదు.యోగ సంసిద్దిని పొందినవాడు 

దానిని కాలక్రమేణా తనలోనే పొందుతాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.