గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఏప్రిల్ 2022, గురువారం

యత్సాఙ్ఖ్యైః ప్రాప్యతే స్థానం..|| 5-5 ||..//...సన్న్యాసస్తు మహాబాహో ..|| 5-6 ||..//..పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః

జైశ్రీరామ్..

|| 5-5 ||

యత్సాఙ్ఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే|

ఏకం సాఙ్ఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి.

తే.గీ. సాంఖ్యు లేస్థానమును పొంది, సమ్మతిగను

చుందు రట్టిదే యోగులున్ పొందుదు రిల

సాంఖ్యయోగంబులొకటంచు సరసులు గను

చుందు రవ్వారి దృష్టియే శుద్ధమరయ.

భావము.

సాంఖ్యులచేత ఏస్థానం పొందబడుతుందో, ఆస్థానమే యోగులుచేత 

పొందబడుతుంది. సంఖ్య యోగాన్ని ఒకటిగా ఎవరు చూస్తున్నారో వాళ్ళే 

నిజమైన దృష్టి కలిగిన వారు.

|| 5-6 ||

సన్న్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః|

యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్ఛతి.

తే.గీ. కర్మయోగ దూరులకిల కష్టమగును

కర్మసన్న్యా సాధన, కర్మయోగు

లనతికాలమునను బ్రహ్మమంద గలరు,

తేలికగనే మహాబాహు! తెలియుమిదియు.

భావము.

ఓ మహాబాహో! కర్మయోగం చెయ్యని వాళ్ళకు కర్మసన్యాసాన్ని 

సాధించడం కష్టం. కర్మ యోగంతో కూడిన మానవుడు త్వరలోనే 

తేలికగా బ్రహ్మమును చేరుకుంటాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.