జైశ్రీరామ్.
జ్ఞాన కర్మ సన్యాసయోగః
|| 4-21 ||
శ్లో. నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః|
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్.
తే.గీ. ఆశయే లేక దేహమ్ము ననుపమగతి
నిగ్రహించి, పరిగ్రాహి నేనటంచు
తలప కెవ్వండు చేయునో తనువున పని,
పొంద డెట్టి పాపంబులు, భువిని పార్థ!
భావము.
ఆశలేక, మన శరీరాలను నిగ్రహించి, అన్నిటి యందు పరిగ్రహ భావాన్ని
వదిలి, కేవలం శరీరంతో కర్మ చేసేవాడు ఏ పాపాన్నీ పొందడు.
|| 4-22 ||
శ్లో. యదృచ్ఛాలాభ సన్తుష్టో ద్వన్ద్వాతీతో విమత్సరః|
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే.
తే.గీ. ప్రాప్త మగునదే ఘనమని పరవసించచి,
ద్వంద్వమునకు నతీతుడై వరలుచుండి,
మత్సరములేక, ఫలితంబు మంచిది కని
పొంగకన్ కర్మ సలుప నసంగు డతడు.
భావము.
యాదృచ్చికంగా లభించిన దానితో సంతృప్తుడై, ద్వందాలకు అతీతుడై,
మాత్సర్యం లేకుండా, ఫలం లభించినపుడు కూడా సమంగా ఉండేవాడు
కర్మ చేసినా బద్ధుడు కాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.