గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఏప్రిల్ 2022, సోమవారం

యస్య సర్వే సమారమ్భాః..|| 4-19 ||..//..త్యక్త్వా కర్మఫలాసఙ్గం..|| 4-20 ||..//.. జ్ఞాన కర్మ సన్యాసయోగః

 జైశ్రీరామ్.

 జ్ఞాన కర్మ సన్యాసయోగః

|| 4-19 ||

శ్లో. యస్య సర్వే సమారమ్భాః కామ సఙ్కల్ప వర్జితాః|

జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పణ్డితం బుధాః.

తే.గీ. కామ సంకల్ప రహితుడై కర్మల నిల

చేయు ప్రారంభమెవ్వరు ధ్యేయమలర

జ్ఞాన దగ్ధ కర్ముని వాని గాంచిన ఘనులు

సద్వివేకిగా ఘనులెంత్రు కొనుము పార్థ! 

భావము.

ఎవరు కామ సంకల్పం లేకుండా అన్ని కర్మలను చక్కగా ప్రారంభిస్తారో, జ్ఞానాగ్నిలో 

కర్మలన్నిటినీ కాల్చివేసిన అతణ్ణి వివేకి అని విద్వాంసులంటారు.

|| 4-20 ||

శ్లో. త్యక్త్వా కర్మఫలాసఙ్గం నిత్యతృప్తో నిరాశ్రయః|

కర్మణ్యభిప్రవృత్తోऽపి నైవ కిఞ్చిత్కరోతి సః.

తే.గీ. కర్మ ఫలబంధమును వీడి, కలిగి తృప్తి,

దేనిపైన ననాధారి యైనవాడు,

కర్మ మగ్ను డైనను కాని కర్మ చేయ

నట్టివాడే సుమా మది పెట్టి చూడ.

భావము.

కర్మ ఫలంతో సంగాన్ని వదిలి నిత్యతృప్తుడై దేనిమీద ఆధారపడని వాడై, 

కర్మలలో నిమగ్నుడై ఉండేవాడు ఏకర్మనీ చేయని వాడే అవుతాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.