జైశ్రీరామ్.
|| 4-35 ||
శ్లో. యజ్జ్ఞాత్వా న పునర్మోహ మేవం యాస్యసి పాణ్డవ|
యేన భూతా న్యశేషాణి ద్రక్ష్య స్యాత్మ న్యథో మయి.
తే.గీ. ఏది పొందిన మోహాననెపుడు పడవొ,
యేది పొందిన నీలోన నెన్ని చూడ
గలవొ జీవులన్ నాలోన ఘనతరముగ
పొందుమా దానినే నీవు కుందనేల?
భావము.
అర్జునా! దేనిని పొందాక తిరిగి ఇలా మోహంలో పడవో, దేని చేత
అశేషమైన జీవరాశుల్ని నీలోను, నాలోను చూడగలుగుదువో
ఆ జ్ఞానాన్ని పొందు.
|| 4-36 ||
శ్లో. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాప కృత్తమః|
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సన్తరిష్యసి.
తే.గీ. పాపు లందరిలో మహా పాపివయిన
జ్ఞాన మనియెడి పడవలో ఘనతరముగ
పాపమును దాటగల వీవు పట్టుపట్టి,
నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.
భావము.
పాపులందరిలోకి ఎక్కువ పాపం చేసిన వాడివైనా పాపాన్నంతటినీ
జ్ఞానమనే పడవతో దాటగలవు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.