జైశ్రీరామ్.
|| 4-41 ||
శ్లో. యోగసంన్యస్త కర్మాణం జ్ఞానసఞ్ఛి న్నసంశయమ్|
ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ.
తే.గీ. యోగమునకర్మలన్ వీడు యుక్తిపరుని,
జ్ఞానమున సంశయచ్ఛేద ఘనుని యాత్మ
నిష్టు నే కర్మలున్ గట్ట నేర విలను,
పార్థ! గ్రహియింపుమిదినీవు పట్టుపట్టి.
భావము.
అర్జునా! యోగం వలన కర్మలను వదిలించుకొని, జ్ఞానం వలన
సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మ నిస్టుడిని కర్మలు బంధించలేవు.
|| 4-42 ||
శ్లో. తస్మాదజ్ఞాన సమ్భూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః|
ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత.
తే.గీ. ఆత్మ సు జ్ఞాన ఖడ్గాన నసదృశముగ
నీదు సంశయముల్ నీవు నేర్పు మీర
ఛేదనము చేసి యోగంబు చేయబూను
మర్జునా! లేచి నిలబడుమభయమిత్తు.
భావము.
అందుచేత అజ్ఞానం వలన జనించి నీ హృదయంలో ఉన్న సంశయాన్ని
ఆత్మజ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి, యోగాన్ని అవలంబించు.అర్జునా
లేచి నిలబడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.