గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఏప్రిల్ 2022, గురువారం

తద్బుద్ధయ స్తదాత్మాన.. || 5-17 ||..//....//.విద్యావినయ సమ్పన్నే.|| 5-18 || ..//..పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః.

  జైశ్రీరామ్. 

 || 5-17 ||

శ్లో. తద్బుద్ధయ స్తదాత్మాన స్తన్నిష్ఠా స్తత్పరాయణాః|

గచ్ఛన్త్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః.

తే.గీ.  ఆత్మలో బుద్ధి నిలుపుచు నాత్మభావ

మునె మదినినింపి యత్మయే ముఖ్యమనెడి

జ్ఞాన నిర్దూత కల్మషుల్ ఘనులు కనగ

జన్మరాహిత్యమొందు ప్రశస్తముగను.

భావము.

ఆత్మలోనే బుద్ధిని నిలిపి, ఆత్మభావంతో మనసు నింపి, ఆత్మనే 

అంతిమ లక్ష్యంగా పెట్టుకుని అత్మాభాసం చేసేవాళ్ళు పాపములు 

నశింప బడిన వారై తిరిగిరాని స్థిని పొందుతారు.

|| 5-18 ||

శ్లో.  విద్యావినయ సమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని|

శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః.

తే.గీ. 

వసుధ విద్యా వినయులగు బ్రాహ్మణులను, 

కుక్క నేనుగున్ గోవును కుక్క మాంస

భక్షకుల సమదృష్టితో పరిగణించు

పండితుడు సమదర్శియై, వంద్యుడతడు.

భావము.

మహాత్ములు విద్యా వినయాలతో కూడిన బ్రాహ్మణుడిలో, గోవులో, 

ఏనుగులో, కుక్కలో, కుక్కమాంసాన్ని వండుకుని తినే చంఢాలునిలో 

కూడా పండితులు సమాన తత్వాన్నే చూస్తారు.

.జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.