గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఏప్రిల్ 2022, ఆదివారం

కాయేన మనసా బుద్ధ్యా.. || 5-11 ||..//.. యుక్తః కర్మఫలం త్యక్త్వా..|| 5-12 ||..//..పఞ్చమోధ్యాయః - సన్న్యాసయోగః

జైశ్రీరామ్. 

|| 5-11 ||

శ్లో.  కాయేన మనసా బుద్ధ్యా కేవలైరిన్ద్రియైరపి|

యోగినః కర్మ కుర్వన్తి సఙ్గం త్యక్త్వాత్మశుద్ధయే.

తే.గీ. త్రికరణములను శుద్ధులై శ్కటితమగు

భావము.సంగ రహితులై యోగులు సకలకార్య

ములను కేవలేంద్రియములన్ పూర్తి చేసి

కర్మఫలదూరులైయుందురర్మిలి సఖ!

యోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసం సంగభావాన్ని వదిలి కేవలం 

శరీర, మనో, బుద్ధి. ఇంద్రియాలతో మాత్రమే కర్మలు చేస్తారు.

|| 5-12 ||

శ్లో. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్ఠికీమ్|

అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే.

తే.గీ.  అరయ కర్మఫలత్యాగి యగుచు యోగి

శాశ్వతంబైన శాంతినే సతము గనును.

కోరికలు వీడనేరక కూరుకొనుచు

పోవుచుండును బంధనములనయోగి.

భావము.

యోగయుక్తుడైన వాడు కర్మఫలాన్ని వదిలి పెట్టి శాశ్వత మైన శాంతిని 

పొందుతాడు. యోగికానివాడు కోరికల కారణంగా కర్మఫలానికి అతుక్కు 

పోయి బంధింప బడతాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.