జైశ్రీరామ్.
అథ పఞ్చమోధ్యాయః - సంన్యాసయోగః
|| 5-1 ||
అర్జున ఉవాచ|
భావము.
అర్జునుడు ఇలా అడిగాడు.
శ్లో. సంన్యాసం కర్మణాం కృష్ణ! పునర్యోగం చ శంససి|
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్.
తే. కర్మసన్యాస మొకపరి, కర్మయోగ
మొకపరి ప్రశంసితములయ్యె, నొక్కదాని
నిందు ఘనమైనదేదియో ముందు తెలుపు
మయ్య! శ్రీకృష్ణుడా!యనె నర్జునుండు.
భావము.
ఓ కృష్ణా ఒకసారి కర్మ సన్యాసాన్ని, మరొకసారి కర్మ యోగాన్ని
పొగుడుతున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపుము.
|| 5-2 ||
శ్రీభగవానువాచ|
భావము.
శ్రీ కృష్ణుడన్నాడు.
శ్లో. సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయస కరావుభౌ|
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే
తే.గీ. కర్మసన్యాసము మరియు కర్మ యోగ
ము ఘనమైన వానందదము లరయగ ను,
కర్మసన్యాసమే మేలు కర్మయోగ
ము సరి కాదు దానికి చూడ ముక్తిదమది.
భావము.
కర్మసన్యాసమూ, కర్మయోగమూ రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి
తీసుక వెళతాయి. ఐతే ఈ రెండింటిలో కర్మ యోగము కర్మసన్యాసము
కంటే మెరుగైనది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.