గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఏప్రిల్ 2022, శనివారం

అపానే జుహ్వతి ప్రాణం.. || 4-29 ||..//..అపరే నియతాహారాః .. || 4-30 ||..//..జ్ఞాన కర్మ సన్యాస యోగము.

జైశ్రీరామ్. 

|| 4-29 ||

శ్లో. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే|

ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః.

తే.గీ. శ్వాస నల నిరోధించి, యపానమునకు

బ్రాణమున్, బ్రాణమునకు నపాన మెన్ని

యాహుతుల్ చేయుదురు కొంద రనుపము లిల,

నీవు గ్రహియింపుమిద్దియు నిర్మలాత్మ!

భావము.

అలాగే ప్రాణాయామ పరాయణులైన మరి కొందరు ఉచ్వాస 

నిచ్వాసములను నిరోధించి, అపానానికి ప్రాణాన్ని, ప్రాణాన్ని అపానానికి, 

ఆహుతులుగా అర్పిస్తారు.

 || 4-30 ||

శ్లో. అపరే నియతాహారాః ప్రాణాన్ప్రాణేషు జుహ్వతి|

సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః.

తే.గీ. పరిమితాహారుల్ ఘనుల్ ప్రాణమునకు

బ్రాణ మాహుతి యొనరింత్రు, వారు యజ్ఞ 

విదులె, కల్మషంబులనిట వీడుచుంద్రు

యజ్ఞములచేత, నిజమిది యరయుమీవు.

భావము.

మరికొందరు నియమితమైన ఆహారాన్ని స్వీకరిస్తూ, ప్రాణాన్ని ప్రాణానికి 

ఆహుతులుగా అర్పిస్తారు. వీరందరూ యజ్ఞానాలను ఎరిగినవారే. యజ్ఞం 

వలన కల్మషాలను హరింప చేసుకుంటారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.