గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఏప్రిల్ 2022, మంగళవారం

. శ్రేయా న్ద్రవ్య మయా ద్యజ్ఞా..|| 4-33 ||..//.. తద్విద్ధి ప్రణిపాతేన ..|| 4-34 ||..//..జ్ఞాన కర్మ సన్యాస యోగము.

జైశ్రీరామ్.

|| 4-33 ||

శ్లో. శ్రేయా న్ద్రవ్య మయా ద్యజ్ఞా జ్జ్ఞాన యజ్ఞః పరన్తప|

సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే.

తే.గీ. ద్రవ్యమున జేయు యజ్ఞంబు భవ్య మవదు 

జ్ఞాన యజ్ఞంబు కన్నను కనగ పార్థ!

జ్ఞాన యజ్ఞంబు గొప్పది కలియునన్ని 

రకముల ఫలితంబు లందె కలుగు.

భావము.

అర్జునా! పరంతపా! ద్రవ్యంతో చేసే యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనది. 

అన్ని రకాల కర్మలూ జ్ఞానంలో లీనమౌతాయి.

|| 4-34 ||

శ్లో. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా|

ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః.

తే.గీ. జ్ఞాన మాత్మార్పణము, సేవ, ధీనిధువను

ప్రశ్నవేయుట వలనను, పార్థ! యెరుగు

మాత్మ తత్వజ్ఞు లది నీకు నాదరముగ

బోధ జేయుదురది నీకు బొధపడగ.

భావము.

జ్ఞానాన్ని ఆత్మార్పణ భావం, సేవ, ప్రశ్నించడం ద్వారా తెలుసుకో, జ్ఞానులు, 

తత్వవేత్తలూ ఐనవారు నీకు ఉపదేశిస్తారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.