గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జూన్ 2014, ఆదివారం

యుగాంతే ప్రచలేన్మేరుః ...మేలిమి బంగారం మన సంస్కృతి 213.

 జైశ్రీరామ్.
శ్లో. యుగాంతే ప్రచలేన్మేరుః , కల్పాంతే సప్త సాగరాః
సాధవః ప్రతిపన్నార్థాన్న చలంతి కదాచ న. 
క. మేరువు కదిలిన కదులును, 
మేరలధిగమింప వచ్చు మేదిని జలధుల్,
నోరార పలికు మాటలు
మీరరు భువి సాధు జనులు మేరువు పడినన్.
భావము. యుగాంతంలో మేరు పర్వతం చలించవచ్చుగాక. కల్పాంతంలో సప్త సముద్రాలూ తమ మేరలు మీరవచ్చుగాక సజ్జనులు మాత్రం ఏనాడూ తాము పలికిన మాటలనుండి చలించరు.(మాట తప్పరు)
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును అధర్మమే నాలుగు పాదాల నడుస్తున్న ఈ కలియుగంలో అలాంటి సజ్జనులు కొంద రైనా ఉండక పోతే ఇంకెలా ఉండేదో ? అమృత గుళికల నిధి ఆంధ్రామృతం హేట్సాఫ్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.